Mr Pregnant Telugu movie Review : ఎమోషనల్ లవ్ డ్రామా!

Mr Pregnant Telugu movie Review : ఎమోషనల్ లవ్ డ్రామా!

నూతన నవతరం దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో సోహైల్‌ హీరోగా వచ్చిన తాజా చిత్రం `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌`. రూపా కొడువయుర్‌ కథానాయికగా నటించింది. మైక్‌ మూవీస్‌ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదలకు ముందు విభిన్న తరహాలో పబ్లిసిటీ చేశారు. సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేశారు. ఈ చిత్రం ఈ శుక్రవారం (ఆగస్టు 18, 2023) విడుదలయింది. మరి ఈ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఎలా ఉంది..? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం… కథ : అనగనగా.. ఓ అనాథ. గౌతమ్ (సోహెల్). టాటూ ఆర్టిస్ట్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. టాటూ కాంపిటీషన్స్‌లోనూ పాల్గొంటూ విజయాన్ని సాధిస్తాడు. మరోవైపు గౌతమ్‌ ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి (రూపా కొడువయూర్) ఎంతో…