యంగ్ హీరో రోషన్ కనకాల లేటెస్ట్ వైల్డ్ బ్లాక్ బస్టర్ ‘మోగ్లీ 2025’. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 13న వరల్డ్ వైడ్ విడుదలై వైల్డ్ బ్లాక్ బస్టర్ గా అలరిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. వైల్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ. ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 12 అనుకున్నప్పుడు ఒక మంచి డేట్ దొరికింది అనుకున్నాం. కానీ…
