మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా డిసెంబర్‌లో విడుదల కానుంది. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను తెలుగు, హిందీలో విడుదల చేసిన మేకర్స్ దీపావళిని ముందుగానే ప్రారభించారు. టీజర్ లోకి వెళితే.. ధమాకా రవితేజ మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. టీజర్ రవితేజ డాషింగ్ క్యారెక్టర్ ని ప్రజంట్ చేసింది డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు రవితేజ. టీజర్ లో రవితేజ పలికిన కొన్ని వన్ లైనర్లు…