గౌతంరాజు తనయుడి మరో చిత్రం ప్రారంభం

comedian gautham raju son movie launched

డి ఎస్ ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై హాస్య నటుడు గౌతమ్ రాజు కొడుకు కృష్ణ మరియు ఆయుషి హీరో హీరోయిన్‌గా డి ఎస్ రాథోడ్ దర్శకత్వంలో వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఈ రోజు హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభం అయ్యింది. తనికెళ్ళ భరణి మరియు కె ఎస్ రవి కుమార్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజ కార్యక్రమం అనంతరం హీరో హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి క్లాప్ ఇవ్వగా, కె ఎస్ రవి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. అనంతరం పాత్రికేయులతో దర్శకులు డిఎస్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిధులు గౌతమ్ రాజు గారికి, తనికెళ్ళ భరణి గారికి మరియు కె ఎస్ రవి కుమార్…

ప్రారంభమైన సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’

satyadev new movie thimmarusu launched

‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం ‘తిమ్మరుసు’ ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సినిమాటోగ్రాఫర్‌ అప్పూ ప్రభాకర్‌ క్లాప్‌ కొట్టారు. రాజా, వేదవ్యాస్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘తిమ్మరుసు’ చిత్రానికి ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్‌. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ” కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా.. సత్యదేవ్‌ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘తిమ్మరుసు’ సినిమా…

ఆర్జీవీ బయోపిక్ పార్ట్ 1 ‘రాము’ సెట్టెక్కింది

rgv biopic part 1 ramu launched

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్‌లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో మొదలైన ఈ షూటింగ్ కు రామ్ గోపాల వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చారు. ఈ మూడు భాగాల బయోపిక్‌ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1 లో వర్మ కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బొమ్మాకు మురళి మాట్లాడుతూ……