‘మంత్ ఆఫ్ మధు” యూనివర్సల్ అప్పీల్ ఉన్న కంటెంట్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ

'Month of Madhu' Content with Universal Appeal: Hero Sidhu Jonnalagadda at Grand Pre Release Event

నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు”. విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి, హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్…