మోహ‌న్‌బాబు.. ‘స‌న్ ఆఫ్ ఇండియా’

New Image

క‌లెక్ష‌న్ కింగ్ డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు చాలా రోజుల త‌ర్వాత హీరోగా న‌టిస్తోన్న‌ దేశ‌భ‌క్తి క‌థా చిత్రం ‘స‌న్ ఆఫ్ ఇండియా’. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని మోహ‌న్‌బాబు నివాసంలో శుక్ర‌వారం చిత్రీక‌రించిన ముహూర్త‌పు షాట్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు షాట్‌కు విరానికా మంచు, ఐరా, అవ్ర‌మ్ కెమెరా స్విచ్చాన్ చేయ‌గా, ల‌క్ష్మీ మంచు, విద్యానిర్వాణ సంయుక్తంగా క్లాప్ నిచ్చారు. విష్ణు మంచు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్ష‌న‌ల్ టీమ్‌కు అందించారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ సైతం ఈరోజే మొద‌లైంది. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ‘స‌న్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్ట‌ర్‌కు ఎక్స‌లెంట్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని అత్యంత…