మూడేళ్ల విరామం తర్వాత అనుష్క నటించిన సినిమా కావడం.. ’జాతిరత్నాలు’ వంటి విజయం తర్వాత నవీన్ పోలిశెట్టి చేసిన సినిమా కావడం.. నిర్మాణంలో రాజీ అంటూ తెలియని యూవీ క్రియేషన్స్‌వాళ్లు నిర్మించిన సినిమా కావడం.. ఈ కారణాలవల్ల ఈ సినిమాపై నిర్మాణంలోవున్నప్పట్నుంచీ అంచనాలు పెరిగాయి. నాన్నకు దూరమై బాధపడుతున్న అమ్మతో కలిసి పెరిగిన కూతురు అన్విత. ఈ కారణం చేత తనకు పెళ్లిపై సదాభిప్రాయం ఉండదు. పెళ్లి చేయాలని తల్లి ఎంత ప్రయత్నించినా అన్విత మాత్రం ఒప్పుకోదు. ఓరోజు తనకు తల్లి కూడా దూరమవుతుంది. ఉన్న ఒక్క తోడు దూరమవ్వడంతో అన్విత ఒంటరి తనాన్ని భరించలేకపోతుంది. అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే, బయటనుంచి వచ్చే ఆ ప్రేమలో నిజం ఉంటుందో ఉండదో!? అనే భయం, అనుమానం. అందుకే అమ్మలేని లోటును అమ్మ అయ్యి తీర్చుకోవాలనుకుంటుంది. పెళ్లితో, శారీరక…