తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మరో అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో… టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ఈ రోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా సంఘం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. తెలంగాణ సినీ కార్మికులు సభ్యులుగా…