మెగాస్టార్ ‘ఖైదీ’ చిత్రానికి 40 ఏళ్లు!

Megastar's film 'Khaidi' turns 40!

చిరంజీవి సినీ చరిత్రలో ‘ఖైదీ’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ సినిమా ఇది. అప్పటి వరకూ కమర్షియల్‌ ఫార్మెట్‌ వేరు. ఈ చిత్రం తర్వాత కమర్షియల్‌ సినిమా లెక్క మొత్తం మారిపోయింది. టాలీవుడ్‌ కలెక్షన్ల లెక్కల రూపురేఖల్ని మార్చేసిన సినిమా ఖైదీ. చిరంజీవి సినిమాల్లో కలెక్షన్ల స్టామినా చూపించిన సినిమా ఇది. చిరంజీవి, మాధవి జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. సంయుక్తా మూవీస్‌ పతాకంపై ధనుంజయరెడ్డి, కె.నరసారెడ్డి, ఎస్‌.సుధాకరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఖైదీ’ చిత్రం 1983 అక్టోబర్‌ 28న విడుదలైంది. అంటే నేటికి ఈ చిత్రం విడుదలై నాలుగు దశాబ్ధాలు పూర్తయింది. ఈ చిత్రంతో చిరంజీవి అభిమానుల గుండెలో శాశ్వత ఖైదీగా నిలిచిపోయారు. బెయిల్‌ దొరకని ‘ఖైదీ’ లా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బందీ అయిపోయారు. ఖైదీ చిత్రం 40…