విడుదలకు ముందే ’మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు దక్కాయి. విడుదలకు ముందే సినిమాను వీక్షించిన చిరు చాలా బాగుందంటూ కితాబిచ్చారు. ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. అంతే కాదు.. సినిమాకు రివ్యూ కూడా ఇచ్చేశారు. అభిమానులతో కలిసి థియేటర్‌లో సినిమా చూడాలనే కోరిక కలిగిందని అన్నారు. ;’మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ఎం సినిమా చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్ టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిప్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనుష్క…