‘భోళా శంకర్‌’ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్

Megastar Chiranjeevi and Keerthy Suresh will be the main attraction in 'Bhola Shankar'

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోలా శంకర్‌’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 14.5 M+ వ్యూస్ తో వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. చిరంజీవి స్వాగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానులు, మాసెస్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భోళా శంకర్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్ ద్వారా అర్థమైంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అన్న చెల్లెల బంధం సినిమాకు ప్రధాన…