సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నుండి ‘అమృత… ’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సాంగ్‌ను ట్విట్టర్‌లో విడుదల చేస్తూ సాయితేజ్‌కు పుట్టినరోజు అభినందనలు తెలిపారు. ‘ఇదే నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్. ఈ బర్త్‌డేను స్పెషల్ బర్త్‌డే చేసిన మామయ్యకు థాంక్స్. మీ ఆశీర్వాదాలకంటే నాకింకేం అక్కర్లేదు. థాంక్యూ సోమచ్ మామయ్య’ అంటూ సాయితేజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత…