మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ పాటకు అనూహ్య స్పందన

ghani movie

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా ‘గని’. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమాలోని మూడో పాట విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. విజయవాడ KL యూనివర్సిటీలో ఈ పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కిరణ్ కొర్రపాటి, నిర్మాత అల్లు బాబీ, సంగీత దర్శకుడు తమన్ మిగిలిన చిత్ర యూనిట్ హాజరయ్యారు. అక్కడ కాలేజీ అమ్మాయిల చేతుల మీదుగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్…