మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తిరిగి యాక్షన్ లోకి దిగుతున్నారు. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో టీమ్ బిజీగా ఉంది. 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను వుంటాయి. నలుగురు…