మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పలాస 1978, శ్రీ దేవి సోడా సెంటర్ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘మట్కా’ చిత్రంతో పాన్-ఇండియన్ అరంగేట్రం చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. మట్కా హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో బిగ్ కాన్వాస్‌పై రూపొందుతోంది. వరుణ్ తేజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మట్కా ప్రిమైజ్ ని చూపించడానికి ఓపెనింగ్ బ్రాకెట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కథానాయకుడు గ్రామోఫోన్‌లో మ్యూజిక్ ని ప్లే చేయడంతో ఇది ఓపెన్ అవుతుంది. ఇది రెండు వేర్వేరు టైమ్‌లైన్‌లలో పాత్రలని ప్రజెంట్ చేస్తోంది. నవీన్ చంద్ర గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, పి రవిశంకర్…