ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్ర రామరాజు ఫర్ భీమ్ టీజర్ ఈ నెల 22న విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ టీజర్ విడుదల కోసం మెగా, నందమూరి అభిమానులే కాదు.. ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురుచూస్తుంది. దీనికి కారణం ఈ చిత్రానికి సంబంధించిన మొదటి టీజర్‌లో చరణ్ వర్కవుట్స్ చేయటం, యాక్షన్ పార్ట్ చూపించటం దానికి ఎన్‌టిఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వటం చాలా హైలెట్ అయ్యింది. అయితే అసలు ప్రాబ్లమ్ ఇప్పుడే మొదలైంది. అదేంటి అంటే ఇప్పడు రివర్స్ గేమ్ స్టార్టయ్యింది. ఈసారి ఎన్టీఆర్ యాక్షన్ కి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ మద్య కొంత యాక్షన్ స్టార్టయ్యింది. భీమ్ ఫర్ రామరాజు టీజర్ విషయంలో మా హీరో…