‘మాయా పేటిక’ నుంచి ‘సాయొనారా..’ లిరికల్ సాంగ్ వచ్చేసింది! :

Sayonara from Mayapetika: Payal Rajput sizzles in Vibrant Party Number

  జూన్ 30న చిత్రం విడుదల ”సాయొనారా ..ఇన్నాళ్ల కలలకు సాయొనారా.. సాయొనారా..” ఆంటోంది బ్యాచిలర్ లైఫ్ మనసారా..’ అంటూ పాయల్ రాజ్‌పుత్ త‌న ఫ్రెండ్స్‌తో చిల్ అవుతోంది. అస‌లామె అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలంటే ‘మాయా పేటిక’ సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు మేక‌ర్స్‌. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆదివారం చిత్ర యూనిట్ ‘సాయొనారా..’ అనే యూత్ ఫుల్…