మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ ను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ ప్రీ లుక్ పోస్టర్.. ఫస్ట్ లుక్, టీజర్పై క్యూరియాసిటీని పెంచింది. పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్ ప్యాక్డ్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ , టీజర్ను విడుదల చేశారు మేకర్స్. బిల్డ్-అప్ షాట్ లు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాయి. మాస్ని ఎలా మెప్పించాలో బాబీకి తెలుసు. రవితేజ కారులో ఎంట్రీ ఇస్తూ.. చేతిలో మేక పిల్లతో దిగి, విలన్స్ ని ఇరగదీశారు.…