ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, హర్రర్ డ్రామా ‘మసూద’ వంటి విభిన్న కథలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించి ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా.. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియా సమావేశం నిర్వహించారు. నిజాయితీతో, క్రమశిక్షణతో ఏ పని చేసినా.. విజయం ఖచ్చితంగా వస్తుందనే దానికి ఉదాహరణే స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నుంచి వచ్చే చిత్రాలని ఆయన చెబుతున్నారు. ఈ ఐదు సంవత్సరాలలో తను అనుకున్నదానికంటే కూడా ఎక్కువే సాధించానని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రాహుల్ యాదవ్ నక్కా మీడియాతో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే… – ‘మసూద’ సినిమా విజయం సాధించినందుకు, అందరి నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. – హ్యాట్రిక్…