‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్

‘Maruva Tarama’ pre-release event

సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘మరువ తరమా’. ఈ చిత్రంలో హరిష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. సినిమా నవంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు, నారా రోహిత్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగాహాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నాను అని చైతన్య చెప్పినప్పుడు ఆలోచించుకోమని అన్నాను. కానీ చైతన్య తనమీద తనకున్న నమ్మకంతో ధైర్యంగా అడుగేశారు. నాకు సినిమాలు చాలా ఇష్టం. రోహిణి గారు అప్పటికీ…