మంచు మోహన్ బాబు.. ఈ పేరు వింటేనే మనకు ఆయన నటించిన ‘పెదరాయుడు’ లాంటి ఎన్నో సినిమాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. ఓ సామాన్య వ్యక్తి నుండి అసమాన శక్తిగా ఎదిగి.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర సింహాసనం వేసుకుని కూర్చున్న విలక్షణ నటుడాయన. విలన్, హీరో, క్యారక్టర్ నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సృష్టించుకున్న నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మంచు భక్తవత్సలం నాయుడు. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న ‘కలెక్షన్ కింగ్’ నట ప్రస్థానానికి 47 ఏళ్లు. చిత్తూరు జిల్లా మోదుగులపాలెం గ్రామంలో జన్మించిన ఆయన ప్రాధమిక విద్య యర్పేడు, తిరుపతిలలో సాగింది. చిన్నప్పటి నుండి నాటకాలఫై ప్రత్యేక అభిమానం కలిగిన భక్తవత్సలం నాయుడు నటనఫై ఆసక్తి పెంచుకున్నారు. తన కల…