రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ మరియు ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపుద్దిద్దుకుంటున్న చిత్రం “ఆదిపర్వం”. మంచులక్ష్మి ప్రధాన పాత్రలో ఐదు భాషల్లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి దర్శకుడు సంజీవ్ మేగోటి. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామా అని ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ చాలా హైలైట్ గా నిలుస్తుందని… “అమ్మోరు, అరుంధతి” చిత్రాల మాదిరిగా హై టెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలో కూడా సిద్ధం అవుతోందని, ఇటీవల విడుదలయి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న “హనుమాన్” చిత్రం లాగే ఈ సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని “నాగలాపురం నాగమ్మ”గా మంచులక్ష్మి నటవిశ్వరూపం చూడవచ్చని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు…