నా ‘మనసంతా నువ్వే’ అంటోన్న ఎంఎస్ రాజు

manasantha nuvve movie completes 19 years

జీవితంలో చాలా విషయాలు మరచిపోతాం మనం.కానీ, కొన్ని సంఘటనలు….కొన్ని జ్ఞాపకాలు….కొన్ని అనుభవాలు….కొన్ని గాయాలు….అంత సులువుగా మర్చిపోలేం!అందుకే 19 ఏళ్ల క్రితం నాటి విషయాలు ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయాయి.2001 సంక్రాంతి…నా ‘దేవీపుత్రుడు’ రిలీజ్.ఒకటి రెండూ కాదు.. 14 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. నేను పడిన కష్టం, నేను పెట్టుకున్న ఆశలు అంతా ఆవిరైపోయాయి.దెబ్బలు నాకు కొత్త కాదు… పరాజయాలు నాకు పరిచయం లేనివి కాదు… కానీ ఈ దెబ్బ, ఈ పరాజయం మాత్రం నన్ను బాగా కుంగదీసి పారేసింది.‘శత్రువు’ సక్సెస్ ఇచ్చిన కిక్,‘దేవి’ వల్ల వచ్చిన లైఫ్… ఇవన్నీ ఈ ఫెయిల్యూర్ తో స్మాష్.దానికితోడు కామెంట్లు.అంత బడ్జెట్ తో సినిమా అవసరమా అని ఇంకెంతోమంది తిట్లు.బాగా కుంగిపోయాను నేను.దాన్నుంచి బయటకు రావడానికి పది రోజులు పట్టింది నాకు.ఏదైనా అద్భుతం చేయాలని మనసు ఉవ్విళ్లూరడం…