పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒకరు. ఈ ఏడాది తెలుగులో ‘ఏజెంట్’ సినిమాలో కీలక పాత్రలో మెరిశాడు మమ్ముట్టి. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మమ్ముట్టి ఇప్పటికే గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బజూక’లో నటిస్తున్నాడని తెలిసిందే. డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో కొత్త సినిమా అప్‌డేట్ అందించి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ సారి హార్రర్ థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు. ‘భ్రమయుగం’ టైటిల్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసి లుక్‌లో డార్క్ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా..…