నందమూరి కళ్యాణ్ రామ్..విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదివారం ఈ మూవీలో పవర్‌ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తోన్న హీరోయిన్ మాళవికా నాయర్ పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మణిమేకల పాత్రలో మాళవికా నాయర్ కనిపించనున్నారు. ఆమె లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. డిఫరెంట్ హెయిర్ స్టైల్లో కనిపిస్తున్నారు. మైకు ముందు నిలబడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు ఉంది. అయితే ఆమె పాత్రకు ఈ సినిమాకు కథకు ఉన్న లింకేంటనేది తెలుసుకోవాలంటే మాత్రం నవంబర్ 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు నిర్మాతలు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు,…