డింపుల్ బ్యూటి లావణ్య త్రిపాఠి మల్లికగా చావుకబురు చల్లగా చిత్రంతో కనిపించనుంది. అందాల రాక్షసి చిత్రంలో మనింటి అమ్మాయిలా అందర్ని తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పడు మల్లికగా మొదటి లుక్ లోనే అందరికి దగ్గరయ్యింది. ఇప్పుడు మల్లిక మన బస్తి బాలరాజుతో జోడి కట్టేసింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో వరస విజయాలు అందుకుంటూ సక్సెస్‌కు మారుపేరుగా నిలిచిన బన్నీ వాసు నిర్మాతగా.. ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తీకేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్ వీడియోకి కూడా అనూహ్య స్పందన లభించింది. కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి మాడ్యూలేషన్ చూస్తే…