మాళవికా మోహనన్ ప్రస్తతం సౌత్ ఇండియాలో వరుస భారీ సినిమాలతో దూసుకెళుతోంది. 2013లో తన మొదటి సినిమానే దుల్కర్ సల్యాన్ వంటి స్టార్‌తో నటించి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత తమిళంలో రజనీకాంత్ పేట, విజయ్ మాస్టర్, ధనుష్ మారన్ వంటి పెద్ద సినిమాలతో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన విక్రమ్ ‘తంగలాన్’ సినిమాలో ఆరతిగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ దాదాపు 7 సంవత్సరాల తర్వాత ‘యుద్ర’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘గల్లీబాయ్’, ‘గెహరియాన్’ వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్దార్థ్ చతుర్వేది హీరోగా తెరకెక్కిన ‘యుద్ర’ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది. సుమారు…