మంజిమా మోహన్ ఈ మధ్య ప్రేమలో పడిందని, ఓ యంగ్ హీరోని త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలతో కోలీవుడ్‌లోనే కాకుండా.. టాలీవుడ్‌లో కూడా ఆమె పేరు బాగా వైరల్ అయింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. సీనియర్ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్. చాలా కాలం నుండి వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనేలా వార్తలు బయటికి వచ్చినా..ఈ విషయంలో వీరిద్దరు కానీ, వారి ఫ్యామిలీల నుంచి కానీ ఎవరూ స్పందించలేదు. తాజాగా వారి బంధంపై వారే క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్.. త్వరలో ఒక్కటి కాబోతున్నట్లుగా చెబుతూ.. వారికి నిశ్చితార్థం కూడా పూర్తయినట్లుగా తెలిపే కొన్ని ఫొటోలను షేర్ చేశారు.…