మహేష్‌ బాబు ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ టైటిల్‌ కోసం రాజమౌళి కసరత్తు!

Mahesh Babu's 'SSMB29' title of Rajamouli!

మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ చిత్రం షూటింగ్‌ సైలెంట్‌గా మొదలైంది. ఇప్పటికే మహేష్‌ బాబు, ప్రియాంకా చోప్రాలపై ఓ కీలకమైన సన్నివేశాన్ని 5 రోజులపాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌ లో తీర్చిదిద్దారు. తదుపరి షెడ్యూల్‌ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రలో నానా పటేకర్‌ కనిపించబోతున్నారని టాక్‌. ఆయనపై కూడా లుక్‌ టెస్ట్‌ నిర్వహించారని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మహేష్‌ తండ్రి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఆ పాత్ర కోసం ఎవరిని ఎంచుకొంటారా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. నానా పటేకర్‌ని తీసుకొంది మహేష్‌ తండ్రి పాత్ర కోసమా? కాదా? అనేది తెలియాల్సి ఉంది. మరో పక్క ఈ సినిమా టైటిల్‌ కోసం రాజమౌళి అన్వేషణ మొదలైంది. ‘మహారాజ్‌’ , ‘గరుడ’ అనే…