1992 చిత్ర లిరిక‌ల్ వీడియోస్ విడుదల

1992 movie lyrical videos released

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ పతాకంపై మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘1992’. విజయ దశమిని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ‘చెలియా చెలియా ..’ అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ని సెన్సేషనల్‌ డైరక్టర్‌ వి.వి.వినాయక్ లాంచ్ చేయ‌గా, మ‌రో లిరిక‌ల్ వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ…‘1992’ టైటిల్‌తో పాటు సాంగ్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. కొత్త వారిని ప్రోత్సహించడానికి నేనెప్పుడూ ముందుంటాను. కొత్త వారు చేస్తోన్న ఈ ప్రయత్నం సక్సెస్‌ కావాల‌ని కోరుకుంటున్నా’’ అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ… ‘‘కొత్త కాన్సెప్ట్ తో కొత్త వారంద‌రూ క‌లిసి చేస్తోన్న 1992 చిత్రం విజ‌య‌వంతం కావాలని కోరుకుంటున్నా. ఈ రోజు నేను లాంచ్ చేసిన పాట విన‌సొంపుగా ఉంది’’ అన్నారు. దర్శకుడు శివ పాల‌మూరి మాట్లాడుతూ..‘‘దర్శకుడుగా ఇది…