కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్‌బాబు చాలా రోజుల తర్వాత హీరోగా నటిస్తోన్న దేశభక్తి కథా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో శుక్రవారం చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు విరానికా మంచు, ఐరా, అవ్రమ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, లక్ష్మీ మంచు, విద్యానిర్వాణ సంయుక్తంగా క్లాప్ నిచ్చారు. విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు. అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్షనల్ టీమ్‌కు అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సైతం ఈరోజే మొదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌కు ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత…
Tag: Launch
‘చెప్పినా ఎవరూ నమ్మరు’కి యంగ్ హీరో సపోర్ట్
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో నూతనంగా నిర్మిస్తున్న చిత్రం “చెప్పినా ఎవరూ నమ్మరు” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని లాక్డౌన్ తరువాత థియేటర్లలో ఈచిత్రాన్ని మొదటి చిత్రంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సారిగా నేటి యువతరం హీరోల్లో విజయపథంలో దూసుకెళ్తు ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విస్వక్ షేన్ “చెప్పినా ఎవరూ నమ్మరు” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి… ఈ సినిమా మంచి విజయం సాధించి… అందరికి గుర్తింపు రావాలని చిత్ర యూనిట్‌ను అభినందించారు. చిత్ర నిర్మాత డాక్టర్ ఎం. మురళి శ్రీనివాసులు మాట్లాడుతూ… ” ముందుగా అడిగిన వెంటనే మా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించిన…
వే టు వాష్ డ్రైక్లీనింగ్ అండ్ వాష్ ప్రారంభం
ఈ బిజీ సమయంలో క్లాత్ వాషింగ్ అనేది అందరికి పెద్ద బర్డెన్‌గానే వుంటుంది. ఈ కరోనా సమయంలో బట్టలశుభ్రత మరింత అవసరం. అయితే మీకు అందుబాటు ధరలో మీ బట్టల శుభ్రత బరువును దించేయాలనుకుంటుది వే టు వాష్ డ్రైక్లీనింగ్ సంస్థ. ఇటీవల మాదాపూర్‌లోని అయ్యప్పసోసైటీలో, హాండ్రెడ్ ఫీట్స్ రోడ్డులో ఈ సంస్థ వే టు వాష్ డ్రైక్లీనింగ్ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. వేటు వాష్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ఉచిత పికప్ అండ్ డ్రాప్‌తో సర్వీసులు అందిస్తున్నామని, పూర్తి హైజీనిక్‌తో.. ఎంతో నాణ్యమైన సేవలను ఇస్తున్నామని సంస్థ నిర్వాహకులు గరగ సోమన్న, వెంకటసత్యనారాయణ గొల్ల తెలిపారు. త్వరలోనే జంటనగరాల్లో తమ ఔట్‌లెట్‌లు విస్తరిస్తున్నట్లుగా వారు తెలిపారు.
‘తెరవెనుక’ ఫస్ట్ లుక్ విడుదల
ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం “తెరవెనుక”. ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , TNR , శ్వేత వర్మ , సంపత్ రెడ్డి ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్. శంకర్ మాట్లాడుతూ.. తెరవెనుక చిత్ర దర్శకుడు ప్రవీణ్ చంద్ర నాకు గత 25 ఏళ్లుగా తెలుసు. తన మొదటి సినిమాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు ఈ సినిమాతో ప్రవీణ్ చంద్ర మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.…