‘లక్ష్మీ నరసింహా’ రీ రిలీజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది : నిర్మాత బెల్లంకొండ సురేష్

‘Lakshmi Narasimha’ re-release will also be a blockbuster hit: Producer Bellamkonda Suresh

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘లక్ష్మీ నరసింహా’ మరోసారి థియేటర్స్ లో అలరించడానికి సిద్ధమైయింది. జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో జూన్ 8న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్‌ చేస్తున్నారు. రీరిలీజ్ వెర్షన్ లో కొత్త పాట యాడ్‌ చేశారు. ‘మందేసినోడు’ అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో అన్ స్టాపబుల్ వైబ్ తో కంపోజ్ చేశారు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్‌ మాస్ ని కట్టిపడేసే లిరిక్స్‌ అందించారు. రీరిలీజ్ ప్రెస్ మీట్ లో ఈ సాంగ్ ని గ్రాండ్ గా…