హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ కిడ్స్ స్టోర్ తొలి ఫ్రాంచైజీ స్టోర్ ప్రారంభం!

Anam Mirza launch HunyHuny's first store in Hyderabad at Ashoka One Mall, Kukatpally

హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ త‌న తొలి స్టోర్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని అశోక్ వన్ మాల్‌లో ఆనం మీర్జా(సానియా మీర్జా సోద‌రి) తన కూతురు తో కలసి ఈ కిడ్స్ స్టోర్‌ను ప్రారంభించారు. ఆన‌మ్ మీర్జా మాట్లాడుతూ..హ‌నీహ‌నీలాంటి సంస్థ న‌గ‌రానికి రావ‌డం ప‌ట్ల త‌న‌లాంటి తండ్రులంద‌రికి ఎంతో ఉప‌యోగ‌మ‌న్నారు. మ‌న పిల్ల‌ల‌కు కావాల్సిన అన్ని ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ కొనుగోలు చేసుకోనే వ‌న్‌స్టాప్ కేంద్రంగా ఇది నిలుస్తుంద‌న్నారు. బేబీ క్రిబ్ కాట్, స్ట్రోలర్, ప్రామ్, రాకర్, బంక్ బెడ్స్, బేబీ అల్మిరా, బేబీ స్టడీ టేబుల్ మరియు మరెన్నో సహా వారి హాట్-సెల్లింగ్ ఐటెమ్‌లు ఎంద‌రో ప్రముక‌ తల్లిదండ్రుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. మ‌న ఆలోచ‌న‌ల‌కు, అభిలాష‌కు అనుగుణ‌మైన ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ ద‌క్కించుకోవ‌చ్చ‌న్నారు. గ‌ర్భిణీలుగా ఉన్న వారు, ప్ర‌స‌వించిన వారు, పిల్ల‌లున్న ప్ర‌తి త‌ల్లిదండ్రులు ఈ స్టోర్లో త‌మ‌కు అవ‌స‌ర‌మైన అన్ని…