నేనలా మాట్లాడలేదంటోంది కృతి సనన్‌!

Kriti Sanan says she doesn't talk like me!

జాతీయ పురస్కార గ్రహీత కృతి సనన్‌ ట్రేడింగ్ మాధ్యమాలను సపోర్ట్‌ చేస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! బాలీవుడ్‌ టాక్‌షో ‘కాఫీ విత కరణ్‌’లో ఆమె ట్రేడింగ్ మాధ్యమాలను ప్రోత్సహించారని పలు కథనాలు వచ్చాయి. దీనిపై వివరణ ఇస్తూ కృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘కొన్ని విూడియా సంస్థలు నేను మాట్లాడని వాటిని ప్రచారం చేశాయి. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లతో నాకు అనుబంధం ఉందని రాశారు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. నేను ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు, నివేదికలపై నేను చట్టపరమైన చర్యలు తీసుకున్నాను. లీగల్‌ నోటీసులు జారీ చేశాను. ఇలాంటి తప్పుడు రిపోర్టుల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. మిమి చిత్రం తన నటనకుగానూ ఉత్తమ నటిగా ఈ ఏడాది జాతీయ…