చలన చిత్ర నటిగా, నిర్మాతగా, నేపద్య గాయనిగా శోభనచల స్టూడియో అధినేతగా శ్రీమతి కృష్ణవేణిగారికి తెలుగు సినిమారంగంలో ఓ సువర్ణ అధ్యాయం, మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకొని తెలుగు సినిమారంగంలో బహుముఖాలుగా ఎదిగిన నటీమణి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీమతి కృష్ణవేణి సంస్మరణ సభ హైదరాబాద్, ఫిలింనగర్ లో ఆదివారం రోజు జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆ నాటి నటీమణులందూ ప్రతిభావంతులేనని, నటనతో పోటు పాటలను కూడా స్వయంగా పాడుకునేవారని కృష్ణవేణి గారు విలక్షణమైన నటి అని అన్నారు. 1949లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మనదేశం చిత్రంలో నందమూరి తారకరామారావును పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి గారిదేనని, అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో కీలుగుఱ్ఱంతో స్టార్ స్టేటస్ కూడా మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతుల వల్లనే…