రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోమందికి ఉపాధి కల్పించి వ్యాపారవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి ఇప్పుడు సినీ రంగంలోకి రావణలంక చిత్రంతో హీరోగా నిర్మాతగా అడుగు పెడుతున్నారు. ఈ చిత్రాన్ని బి.ఎన్. ఎస్. రాజు దర్శకత్వం వహించారు. కె.సిరీస్ అని సొంత బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 16.10.20 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫిల్మ్ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… ముందుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రిష్గారికి శుభాకాంక్షలు అన్నారు. ఇలాంటి మంచి చిత్రాల్ని అందరూ తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. ఒకప్పుడు తెలంగాణలో గొప్ప హీరోగా పేరు తెచ్చుకుని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని సినిమాలు చేయాలి అన్నారు. సినిమాపై ఎంతో ఆశక్తితో ఆయన స్వయంగా సినిమాని నిర్మించాలని ముందుకు రావడం చాలా గ్రేట్…