‘కోతలరాయుడు-సామాన్యుడు’ చిత్రాల మధ్య థియేటర్ల గొడవ!!!

Kothalaramudu saamanyudu

టాలీవుడ్ లో ఇప్పుడు ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. అదీ.. ఓ రెండు సినిమాల మధ్య థియేటర్ల గొడవ. విషయంలోకి వెళితే.. ఆ రెండు సినిమాలు శ్రీకాంత్ ‘కోతలరాయుడు’, విశాల్ ‘సామాన్యుడు’. ఈ రెండు చిత్రాలు ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కానున్నాయి. శ్రీకాంత్ ‘కోతలరాయుడు’ ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదలవుతోంది. శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రమిది. వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1గా కొలన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రంలో ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో పృద్వి, మురళి శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి, సుడిగాలి సుధీర్ తదితరులు నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫైట్స్ బాగున్నాయని,…