గీతా ఆర్ట్స్‌ నుంచి కోటబొమ్మాళి పిఎస్‌!

Kotabommali PS from Geetha Arts!

‘భలే భలే మగాడివోయ్‌’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘ప్రతి రోజు పండగే’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ లాంటి అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్‌ సంస్థ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘నాయాట్టు’ అనే సినిమాని తెలుగులో ‘కోట బొమ్మాళి పిఎస్‌’ పేరుతో రీమేక్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. ఈ తెలుగు రీమేక్‌ లో సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌, మేక ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. అలాగే రాహుల్‌ విజయ్‌ , శివాని రాజశేఖర్‌ లు కూడా రెండు కీలక పాత్రల్లో కనపడనున్నారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి మోషన్‌ పోస్టర్‌ ఆమధ్య విడుదల చేశారు, అది కొంచెం ఆసక్తిని పెంచింది.…