బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’ చిత్రాన్ని అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేక వీడియోలో తన రివ్యూని షేర్ చేశారు. నమస్తే. నా రాబోయే చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ పండక్కి వస్తున్నారు నిర్మాత సాహూ గారపాటి గారి మరో చిత్రం కిష్కింధపురి విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా చూసిన నాకు మంచి ప్రయత్నం చేశారని అనిపించింది. ఆ సినిమాలో పనిచేసిన అందరికీ అభినందనలు. సాధారణంగా హారర్ సినిమాలంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ ఒక దెయ్యం…
