దుబాయ్ లో నాగార్జున `ది ఘోస్ట్` చిత్రం కీలక షెడ్యూల్ పూర్తి

King Nagarjuna’s The Ghost’s Lengthy Schedule In Dubai Completed

కింగ్ అక్కినేని నాగార్జున క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అత్యద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. చిత్రబృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్లు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. విజువల్స్, లొకేషన్స్, అధునాతన సాంకేతికతతో లావిష్గా గ్రాండ్ స్కేల్ లో రూపొందించారు. ది ఘోస్ట్ సినిమా యాక్షన్ చిత్రాలు, విజువల్ ఫీస్ట్ను ఆస్వాదించేవారికి కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా, ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని స్టంట్ సీక్వెన్స్లలో హైలైట్ గా వుండనున్నాయి. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, ఈ చిత్రంలో నాగార్జున,…