బాలీవుడ్‌తోపాటు సౌత్‌లో కూడా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అలనాటి తార దివంగత నటి శ్రీదేవి. అదే తరహాలో ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. తల్లి అడుగుజాడల్లో నడుస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. ఇప్పుడు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఖుషి ‘ది ఆర్చీస్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ కూడా నటిస్తోంది. ముంబైలోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో గత రాత్రి ఈ చిత్ర ప్రీమియర్ షో నిర్వహించారు. ఈ షోకు జాన్వీ కపూర్‌తో పాటు బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఇక ఈ షోలో ఖుషి ప్రత్యేక ఆకర్షణగా…