విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు. కలర్ ఫుల్ గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న ‘ఖుషి’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో… మైత్రీ సీఈవో చెర్రీ మాట్లాడుతూ – ‘ఖుషి’ ట్రైలర్ రిలీజ్ వేడుకలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరో విజయ్, దర్శకుడు శివ నిర్వాణ..ఇతర టీమ్ అందరికీ థాంక్స్. మా హీరోయిన్ సమంత ఇక్కడికి…