పవన్‌కల్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘హరిహరవీరమల్లు’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం పవన్ యుద్థ విద్యల కోసం ‘షావోలిన్ వారియర్ మంక్ అకాడమీ’లో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ హర్ష్ వర్మ కూడా ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఈ విషయంపై తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ .. ‘పవన్‌కల్యాణ్ వల్లే నాకు నటనపై ఆసక్తి కలిగింది.ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. సెట్‌లో ఎంతో ప్రశాంతంగా ఉండే ఆయన్ను చూసి ఆశ్చర్యపోయాను. చిన్న విషయాన్ని కూడా నిశితంగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలోనూ స్పష్టత ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం పవన్ ది. క్షణాల్లో సీన్…