ఆలేరు : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ ఎపిసోడ్ అంతా పొలిటికల్, ఫ్యామిలీ డ్రామా అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ కొట్టిపారేశారు. భవిష్యత్తులో అందరూ కలిసిపోతారని జోస్యం చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ .. కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడా? నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని స్థితికి చేరుకున్నాడా? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారని తేల్చి చెప్పారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిదే కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా? కేటీఆర్‌ను కవిత వెనకేసుకురావడం పెద్ద డ్రామా…మొదట కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావు లను టార్గెట్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదేమైనా…
