కన్నడ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లో పరుగులు తీస్తోంది. కేజీయఫ్ వేసిన బాటలో నడవడానికి పలు చిత్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ రేసులో ఉన్న చిత్రమే ‘కాంతార’. పూర్తిగా కన్నడిగులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమా. కర్ణాటకలో మంచి పేరు రావడంతో మిగిలిన భాషల్లోనూ విడుదల చేశారు. ‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం ‘కాంతార’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్…