తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ఈ గురువారం (నవంబర్ 14, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతమేరకు మెప్పించిందో తెలుసుకుందాం! కథ : ఫ్రాన్సిస్ (సూర్య) బౌంటీ హంటర్ (కిరాయికి ఏపనైనా చేసేవాడు). ఇతడికి మరో బౌంటీ హంటర్ ఎంజెల్ (దిశా పటానీ)తో బ్రేకప్ జరుగుతుంది. అయితే డబ్బు కోసం తాము ఒప్పుకొన్న పనులు చేసే క్రమంలో ఇద్దరు గొడవ పడుతుంటారు. అలాంటి సమయంలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జెటా అనే అబ్బాయిని ఫ్రాన్సిస్ కలుస్తాడు. అయితే జెటాను ఓ ముఠా సభ్యులు వెంటాడుతుంటారు. జెటాను కాపాడేందుకు ఫ్రాన్సిస్ తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటాడు. ఫ్రాన్సిస్‌ను మాత్రం ఆరాధ్యపూర్వకంగా…