సుదర్శనం హేమలత సమర్పణలో సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ ప్రధాన పాత్రలో సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళీకలు నిర్మిస్తున్న రామానుజం జీవిత చరిత్రే “జయహో రామానుజ”.ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది.ఈ కార్య క్రమానికిముఖ్య అతిథిలుగా వచ్చిన తిరుమలై కందాడై రామానుజ మఠం పీఠాధిపతి, జగద్గురు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణాచార్యులు గారు “జయహో రమానుజ” చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోదండ రామాచార్యులు(తిరుమలై కందాడై రామానుజ మఠం ఉత్తర పీఠాధిపతి),టి.యఫ్.పి.సి ప్రధాన కార్యదర్శి మోహన్ వడ్ల పట్ల మరియు చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చిన జగద్గురు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణాచార్యులు (తిరుమలై…