పూరి జగన్నాధ్ కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాకు మోక్షం మాత్రం కలగడం లేదు. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట మహేష్‌తో చేయాలని రాసుకున్న కథ.. అలాగే ఓ మూలన పడి ఉంది. పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత మహేష్‌తో మరో సినిమా చేయాలని పూరి ‘జనగణమన’ కథను రాసుకున్నాడు. టైటిల్‌ను కూడా రిజస్టర్ చేయించాడు. అయితే మహేష్‌తో ఈ సినిమా తీయాలని ఎన్ని విశ్వ ప్రయత్నాలు జరిపినా వర్కవుట్ అవలేదు. దాంతో ప్రతీ ఏటా ఆ టైటిల్‌ను రిన్యువల్ చేస్తూ వస్తున్నాడు. ఇక అన్ని కుదిరి రౌడీ స్టార్ విజయ్‌తో ఈ సినిమాను పట్టాలెక్కించాడు. లైగర్ చేస్తున్న టైమ్‌లోనే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూట్ కూడా చేశాడు. యుద్ద విమానాలు, సైనికులు, మిస్సైల్స్, బులెట్లతో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ…