మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పాటలు, ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఫస్ట్ డే మైక్ పట్టుకున్నపుడు ఎలా అనిపించింది ? భోళా శంకర్ షూటింగ్ 2021 నవంబర్ 15న మొదలుపెట్టాం. మొదటి రోజే దాదాపు ఏడు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, భారీ సెట్…