మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

The new horror thriller, which has completed its Madhya Pradesh schedule, is invited to Amaravati.

ప్ర‌జెంట్ హార‌ర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది…మంచి క‌థాబ‌లంతో తెర‌కెక్కిన హార‌ర్‌, థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు థియేట‌ర్స్‌లోనే కాకుండా ఓటీటీల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఆ కోవ‌లోనే ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క‌థ, క‌థ‌నంతో తెర‌కెక్కుతోన్న హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం. శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల‌ విడుద‌లైన టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మ‌ధ్య ప్ర‌దేశ్…